డాక్టర్‌ శాంతా తౌతమ్‌కు వరల్డ్‌ ఇన్నోవేషన్‌ అవార్డు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శాంతా తౌతమ్‌ వరల్డ్‌ ఇన్నోవేషన్‌ అవార్డును అందుకున్నారు. మాస్కోలో నిర్వహించిన బ్రిక్స్‌ ఇన్నోవేషన్‌ ఫోరంలో ఆమెకు ఈ అవార్డును అందజేశారు. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ డెవలప్‌ మెంట్‌ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఇన్నోవేషన్‌ ఎకోసిస్టం రంగంలో తౌతమ్‌ ఏడేండ్ల నుంచి సేవలందిస్తున్నారు. అవార్డును స్వీకరించిన అనంతరం తౌతమ్‌ మాట్లాడుతూ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ దార్శనీకత వల్లే ఈ అవార్డు వచ్చిందని తెలిపారు.

Spread the love