నవతెలంగాణ – హైదరాబాద్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫైట్ రసవత్తరంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉన్నది. జులానా నియోజకవర్గంలో రెజ్లర్ వినేశ్ పోగట్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఆ స్థానం నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తాజా సమాచారం ప్రకారం నాలుగు రౌండ్లు ముగిసేవరకు యోగేశ్ ప్రస్తుతం మూడువేల ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.