వచ్చేనెలలో ‘రెజ్లింగ్‌’ ఎన్నికలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల ప్రక్రియకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) శ్రీకారం చుట్టింది. ఈమేరకు జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మహేశ్‌ మిట్టల్‌ కుమార్‌ను రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌వో)గా నియమించింది. ఎన్నికలను జూలై నాలుగున నిర్వహించాలని ఐఓఏ భావిస్తోంది. అయితే రెజ్లింగ్‌ సమాఖ్య ప్రత్యేక సాధారణ సమావేశంతోపాటు ఎన్నికల నిర్వహణ తేదీని జస్టిస్‌ మిట్టల్‌ స్వయంగా నిర్ణయిస్తారని ఐఓఏ వర్గాలు వెల్లడించాయి.

Spread the love