ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే రైట్‌

ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే రైట్‌మణి దీప్‌ ఎంటర్టైన్మెంట్‌ పతాకం పై కౌశల్‌ మంద, లీషా ఎక్లైర్స్‌ హీరో, హీరోయిన్లుగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘రైట్‌’. మలయాళంలో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన ‘మెమోరీస్‌’ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు లుకలాపు మధు, మహంకాళి దివాకర్‌ సంయుక్తంగా రీమేక్‌ చేశారు. నేడు (శుక్రవారం) ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌, ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమాన్ని ప్రసాద్‌ ల్యాబ్‌లో చిత్ర బృందం నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్‌ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ సినిమా తప్పకుండా హిట్‌ కొడుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘రీమేక్‌ రైట్స్‌ తీసుకున్న తరువాత మొదటి సిట్టింగ్‌లోనే ఈ సినిమా నాతోనే చేస్తానని దర్శకులు శంకర్‌ చెప్పారు. కరోనా సమయంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని షూటింగ్‌ పూర్తి చేశాం. ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’ అని కౌశల్‌ అన్నారు. ‘ఈ కథకు కౌశల్‌ మాత్రమే సరిపోతారని ఎంచుకున్నాం. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా కథను మరింత ఆసక్తికరంగా తయారు చేసి, పూర్తి చేశామని నిర్మాతలు మహంకాళీ దివాకర్‌, మధు తెలిపారు. ‘అన్ని వర్గాల ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే చిత్రమిది. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు శంకర్‌ అన్నారు.

Spread the love