జీపీ కార్మికుల ర్యాలీ, రాస్తారోకో

Rally of GP workers, Rastarokoనవతెలంగాణ-తాండూరు
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ కొనసాగిస్తున్న సమ్మె సోమవారంతో 33వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిం చారు. అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే.శ్రీనివా స్‌ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కా రించాలని డిమాండ్‌ చేశారు. అంతకుమందు గద్దర్‌ చి త్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు, తాండూర్‌ సీనియర్‌ నాయకులు భీమయ్య, మండల అధ్యక్షులు శాంతమ్మ, వెంకటమ్మ, జిలాని, భీమయ్య, ర వి, నరసింహులు, కిరణ్‌, కిష్టప్ప, బషీరాబాద్‌ మండల అధ్యక్షులు శ్యామప్ప, నరేష్‌, లక్ష్మి, చందు,పెద్దముల్‌ మండల శ్రీనివాస్‌, బాలమణి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love