బాన్సువాడలో రాస్తారోకో 

– అంగన్ వాడిలకు మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ 

నవతెలంగాణ-నసురుల్లాబాద్ : అంగన్ వాడి ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కు అంగన్వాడి టీచర్లు వినతి పత్రం సమర్పించగా మంత్రి అంగన్వాడీలను అవమానపరిచిన అంగన్వాడీలను వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కోరుతూ బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ బిజెపి సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో అంధులను కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ బిజెపి నాయకులు మాట్లాడుతూ మంగళవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలో మంత్రి సత్య వతి రాథోడ్ రావడం జరిగింది. ఈ విషయం తెలిసి అంగన్వాడీ టీచర్లు అందరూ కలిసి నసురుల్లాబాద్ వెళ్లి బాన్సువాడ డీఎస్పీ అనుమతి తీసుకొని మంత్రి సత్యవతి రాథోడ్ కలవడం కోసం ఆరుగురు అంగన్వాడి ఇద్దరు సిఐటియు నాయకులు మంత్రి గారికి సన్మానించి అంగన్వాడీ ల సమస్యలు పరిష్కరించాలని కానీ వినతి పత్రం ఇవ్వకన్నా ముందే మంత్రి సత్యవతి తన నిజస్వరూపం చూపించారు. సమ్మె చేస్తున్న టీచర్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు సమ్మెలో ఉన్నారు కాబట్టి మీరు మా పిల్లలు కాదు. మీ వినతి మాకు అవసరం లేదు మీరు వెళ్ళండి అని చెప్పడం జరిగిందన్నారు. పక్కనే రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి సత్యవతి రాథోడ్ గారిని అడుగుతున్నారు రాథోడ్ సమ్మె చేస్తున్న వాళ్లు మన వాళ్లు కారు సార్ వీళ్ళని ఇక్కడి నుంచి పంపేయండి అని చెప్పడం కూడా చాలా దురదృష్టకరం అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్వాడి టీచర్లకు క్షమాపణ చెప్పాలని బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కాసుల బాలరాజు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి భారతి గా ఉంటూ చంటి పిల్లలకు సేవలందిస్తున్న అంగన్వాడి టీచర్లను అవమానించడం దురదృష్టకరమని వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఖలీల్ సురేష్ గొండ అంగన్వాడి టీచర్లు శివగంగ రూప భారతి తదితరులు పాల్గొన్నారు
Spread the love