wtc-2023: నేడు ఉప్పల్‌లో కివీస్ – నెదర్లాండ్స్ మధ్య పోరు..

నవతెలంగాణ – హైదరాబాద్: వరల్డ్ కప్ ఆరంభ మ్యాచులో ఇంగ్లాండును చిత్తుచేసిన న్యూజిలాండ్ మరో పోరుకు సిద్ధమైంది. ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో నెదర్లాండ్స్ తో తలపడనుంది. పాక్ తో తమ తొలి మ్యాచ్లో పోరాడి ఓడిన నెదర్లాండ్ కివీస్ కు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి. ఇక పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో తొలి మ్యాచ్ కు దూరమైన కివీస్ కెప్టెన్ కేన్ నెదర్లాండ్స్ తో పోరుకు దూరమయ్యారు.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్/జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
నెదర్లాండ్స్: విక్రమజీత్ సింగ్, మాక్స్ ఓ’డౌడ్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

Spread the love