యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా పత్తి నిలువలు దగ్దం

నవతెలంగాణ-హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండల పరిధిలోని టేకులసోమారం భారత ఆహార సంస్థ (FCI) గోడౌన్ లో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం  సంబవించింది. గోడౌన్‌లో నిలువ ఉన్న పత్తికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక దళాలు ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎఫ్‌సీఐ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Spread the love