మంత్రి కోమటిరెడ్డితో యాదాద్రి జిల్లా ప్రజాప్రతినిధుల భేటీ

మంత్రి కోమటిరెడ్డితో
యాదాద్రి జిల్లా ప్రజాప్రతినిధుల భేటీ– సీఎం టూర్‌ నేపథ్యంలో చర్చ
నవతెలంగాణ -హైదరాబాద్‌
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈనెల ఎనిమిదిన యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన నేపథ్యంలో ఆ జిల్లా ప్రజాప్రతినిధులు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో భేటి అయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రుల నివాసంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రి-భువనగిరి జిల్లా సమస్యలపై చర్చించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలనీ, అలాగే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకుపోవాలని నిర్ణయించారు. ఈ భేటిలో ప్రబుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love