భక్తులతో కిటకిటలాడిన యంచ విఠలేశ్వరాలయం..

నవతెలంగాణ -నవీపేట్: మండలంలోని యంచ గ్రామంలో పాండురంగని రెండవ పాదంగా పిలువబడే శ్రీ విఠలేశ్వర ఆలయం కొండపైన తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు భక్త భజన మండలి చేసిన భజనలు భక్తులను అలరించాయి. కొండపైన సిసి రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో భక్తులకు ఎంతో సౌకర్యంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ఆషాడ ఏకాదశి సందర్భంగా జిల్లా నుండి వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుండి భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చి విఠలేశ్వరున్ని దర్శించుకున్నారు. ఏకాదశి ఉపవాసం సందర్భంగా భక్తులకు శుక్రవారం ఉదయం అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లహరి ప్రవీణ్ కుమార్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోవింద్, లక్ష్మన్న, గ్రామస్తులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love