కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షునిగా యాషాడం మల్లయ్య

నవతెలంగాణ – తాడ్వాయి
కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షునిగా కాల్వపల్లి గ్రామానికి చెందిన యాషాడ మల్లయ్య ను నియమిస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బీసీ సెల్ మండల అధ్యక్షులు మల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని చేస్తానని ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా శక్తి వంచన లేకుండా పోరాడుతానని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కృషి చేస్తానన్నారు. మండల బీసీ సెల్ అధ్యక్షునిగా ఎన్నికైన సహకరించిన తాడ్వాయి మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్కకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Spread the love