బాలినేనికి షాకిచ్చిన వైసీపీ హైకమాండ్

నవతెలంగాణ – అమరావతి: సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ హైకమాండ్ షాకిచ్చింది. ఆయన ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బాలినేనికి సమాచారం ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. 48 గంటల్లో తన అనుచరులను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఈ అంశంపై బాలినేని చర్చించే అవకాశం ఉందని చెపుతున్నారు.

Spread the love