కుమార్తెకు ప్రేమ వివాహం జరిపించిన వైసిపి ఎమ్మెల్యే

నవతెలంగాణ – అమరావతి: వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తన మొదటి కుమార్తె పల్లవికి ప్రేమ వివాహం జరిపించారు. పవన్‌ అనే యువకుడితో సాంప్రదాయబద్ధంగా బొల్లవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో పెండ్లి చేశారు. ఆ తరువాత ప్రొద్దుటూరులోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ … తన కుమార్తె ఇష్టప్రకారం వారిని ఆశీర్వదించి ప్రేమ వివాహం జరిపించానన్నారు. కలిసి చదువుకున్న రోజుల్లో వారిద్దరూ ఇష్టపడటంతో.. డబ్బు, హోదా, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్టప్రకారమే అంగీకరించి వివాహం చేశామని ఎమ్మెల్యే తెలిపారు.

Spread the love