– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా సంతాపం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అజాత శత్రువు, ఆదర్శనేత అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మార్క్సిస్టు మేధావి, నిరంతర అధ్యయనశీలి, ఉత్తమ పార్లమెంటేరియన్ అయిన ఏచూరి లేనిలోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. సమకాలీన రాజకీయాల్లో ఒక ధృవతార రాలిపోయిందని పల్లా నివాళులర్పించారు.