నవతెలంగాణ-హైదరాబాద్ : సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పేద, కార్మిక వర్గాలకు తీరని లోటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని , ఆయన ప్రతీ అడుగు పేదలు, పీడితులు, కార్మికుల పక్షాన వేశారని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో హక్కుల కోసం బలంగా పోరాడాడని గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఏచూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.