తెలంగాణకు ఎల్లో అలెర్ట్

తెలంగాణకు ఎల్లో అలెర్ట్

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు 24 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అల‌ర్ట్‌ జారీ చేసింది. సోమవారం ఉపరితల ఆవర్తనం నైరుతి, దాని పరిసరాల్లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతుందని వివరించింది. దీంతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రయాణాలు, పనులు చేసుకోవాలని వెల్లడించింది. వాతావరణ శాఖ వర్ష సూచనలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.నిజామాబాద్‌, జగిత్యాల, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమ‌కొండ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్‌ తదితర జిల్లాలకు ఎల్లో అల‌ర్ట్‌ జారీ చేసింది.

 

Spread the love