నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని అభంగపట్నంలో బీజేపీ సీనియర్ నాయకులు సాయి రెడ్డిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ శనివారం పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో ఆయనను పరామర్శించి వైద్య సూచనలిచ్చి ధైర్యం చెప్పారు. ఆయన వెంట వంశీ మోహన్, ఆదినాద్, పుట్ట శ్రీనివాస్ గౌడ్, ఆనంద్, మేక రామకృష్ణ, మహేష్ తదితరులు ఉన్నారు.