ట్రైన్ లో యోగా వేడుకలు..

నవతెలంగాణ – ముంబాయి: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు యోగా కార్యక్రమాల్లో పాల్గొంటూ దాని ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. కాగా, తాజాగా ముంబైలో కొందరు ఔత్సాహికులు యోగా వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణికులతో కలిసి యోగా చేశారు.

Spread the love