నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చల్వాయి లో బుధవారం 9వ అంతర్జాతీయ యోగ దినోత్సవం ఐ ఎన్ ఓ సూర్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంగ్ల ఉపాధ్యాయుడు చల్లగురుగుల మల్లయ్య నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుంజా రాజేశ్వరరావు మాట్లాడుతూ యోగాభ్యాసము వలన ఏకాగ్రత, భౌతిక, బౌద్ధిక, శారీరక సంతులనం కలుగుతూ, మానసిక వికాసానికి ప్రశాంతతకు దోహద పడుతుందని,ప్రతి ఒక్కరు రోజుకు కనీసం అరగంట సమయం కేటాయించి యోగ అభ్యాసం చేసిన ఆరోగ్యంగా ఆనందంగా,ఉల్లాసంగా ఉంటారని అన్నారు. ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న యోగ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రాచుర్యం పొంది నిర్వహింపబడుతోందని అన్నారు.కార్యక్రమాన్ని నిర్వహించిన మల్లయ్యను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉప్పుతల ప్రసాద్,మోలుగూరి రమేష్, దామరాజు సమ్మయ్య,బూత్కూరి శ్యామ్ సుందర్ రెడ్డి, ముడుంబై, వెంకటరమణమూర్తి, శ్రీరాముల శ్రీనివాసరావు, సుతారి మురళీధర్, అందె రమాదేవి, పూసం శ్రీదేవి, రాయబారపు దీప్తి కొత్త వెంకటేష్ పాల్గొన్నారు.