ట్విటర్ (ఎక్స్) వాడాలంటే నెల నెలా చెల్లించాల్సిందే

నవతెలంగాణ – ఢిల్లీ: ట్విటర్‌లో (ప్రస్తుతం ఎక్స్‌)ను హస్తగతం చేసుకున్న ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ అందులో పెను మార్పులు చేశారు. కంపెనీ బాస్​ను తొలగించడం నుంచి ఉద్యోగుల తొలగింపు.. బ్లూటిక్ వంటి ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. అయితే తాజాగా మరో పెద్దమార్పునకు నాంది పలుకుతున్నారు. ఇక నుంచి ఎక్స్ సేవలు వాడాలంటే ప్రతి యూజర్ ఎంతో కొంత చెల్లించాల్సిందేనట. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా వెల్లడించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో చర్చిస్తున్న సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు. ఇక నుంచి ఎక్స్‌ను వాడే వారు ప్రతి నెలా ‘స్వల్ప మొత్తం’ చెల్లించాల్సి ఉంటుందని మస్క్‌ పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం వెనక ఓ కారణం ఉందని తెలిపారు. ఎక్స్‌లో ఉన్న బాట్స్‌ను తొలగించేందుకు ఇదే సరైన మార్గమని.. ప్రస్తుతం ఎక్స్‌లో 550 మిలియన్‌ నెలవారీ యూజర్లు ఉండగా.. సగటున రోజుకు 100-200 మిలియన్‌ పోస్టులు పెడుతుంటారని .. ఇందులో బాట్స్‌ కూడా ఉన్నాయని చెప్పారు.

Spread the love