అసలు సిసలైన.. చంద్రముఖిని చూస్తారు

 The original.. Chandramukhi is seenరాఘవ లారెన్స్‌ హీరోగా, బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్‌ డైరెక్టర్‌ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా ఈనెల 28న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్‌ బ్యానర్‌పై రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా నుంచి సెకండ్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
ఈ సందర్భంగా రాఘవ లారెన్స్‌ మాట్లాడుతూ, ‘రజనీ కాంత్‌ చేసిన రోల్‌లో నేను నటించటం అంటే ఆ రాఘవేంద్రస్వామి అదష్టం అని అనుకోవాలి. సూపర్‌స్టార్‌ చేసిన ఆ పాత్రను నేనెంత గొప్పగా చేయగలనా? అని ఆలోచించలేదు. నా పాత్రకు నేను న్యాయం చేస్తే చాలని అనుకుని చాలా భయపడుతూ నటించాను. కచ్చితంగా సినిమా మీ అందరినీ మెప్పిస్తుంది. కంగనా రనౌత్‌ వంటి పెద్ద స్టార్‌తో నటించటం లక్కీ. ఆమె చంద్రముఖి పాత్రలో భయపెట్టారు’ అని తెలిపారు.
డైరెక్టర్‌ పి.వాసు మాట్లాడుతూ, ‘చంద్రముఖి సినిమాతో ‘చంద్రముఖి2’ను లింక్‌ చేసి ఈ కథను సిద్ధం చేశాను. ఇందులో 17 ఏళ్ల ముందు కోట నుంచి వెళ్లి పోయిన చంద్రముఖి మళ్లీ ఎందుకు వచ్చిందనే పాయింట్‌తో దీన్ని చేశాను. సూపర్‌స్టార్‌ రజనీ పాత్రలో రాఘవ లారెన్స్‌ నటించారు. కీరవాణిగారితో వర్క్‌ చేయటం వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌.ఈ సినిమాకు ఆయన అత్యద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. ఈ సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుంది’ అని తెలిపారు.
‘ఇందులో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి అరుదైన చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా అందర్నీ అలరించడం ఖాయం’ అని మెహరీన్‌ చెప్పారు.
‘ఏక్‌ నిరంజన్‌’ తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులను ఈ సినిమాతో పలకరించబోతున్నాను. ఇందులో చంద్రముఖి పాత్రను నేనే కావాలని దర్శకుడు వాసుని అడిగాను. ‘చంద్రముఖి’గా జ్యోతిక చేసిన పాత్ర నుంచి స్ఫూర్తి పొందాను. అందులో జ్యోతికను చంద్రముఖి ఆవహిస్తుంది. కానీ ఇందులో నిజమైన చంద్రముఖి పాత్ర ఉంటుంది.
– కంగనా రనౌత్‌ 

Spread the love