‘అఖండ 2’ లో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ…

నవతెలంగాణ – హైదరాబాద్: ఈ సంక్రాంతి పండ‌క్కి నంద‌మూరి బాల‌కృష్ణ‌ ‘డాకు మ‌హారాజ్‌’తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ‘అఖండ 2’తో బిజీగా ఉన్నారు. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ‘అఖండ’కు ఇది సీక్వెల్. దీంతో ఈ మూవీపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవ‌లే ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. అయితే, తాజాగా మేకర్స్ ఈ సినిమాలో నటించనున్న మరో హీరోయిన్‌ పేరును వెల్ల‌డించారు. యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ ‘అఖండ 2’లో నటించనున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేర‌కు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు. “టాలెంటెడ్ నటి సంయుక్తకు ‘అఖండ 2’ ప్రాజెక్ట్ లోకి స్వాగతం. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుద‌ల‌ కానుంది” అని మేకర్స్ పోస్ట్ చేశారు.

Spread the love