నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో ఏటా రూ.20వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన రాష్ట్ర పథకాలపై వివరించారు. అక్షరాస్యత పెంపునకు రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొస్తామన్నారు. టాటా కంపెనీ సహకారంతో 65 ఐటీఐలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.