యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి 

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో 18 సంవత్సరాల నిండిన యువతీ, యువకులకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ అందించే కార్యక్రమం చెప్పట్టారని,ఈ అవకాశాన్ని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని పెద్ద గుండవెల్లి బీఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లుగారి ప్రేమ్ అన్నారు. దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెళ్లి గ్రామంలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మంగళవారం (రేపటి నుంచి)నుంచి  13 జూలై గురువారం
 2023 సాయంత్రం 4 గంటల వరకు దుబ్బాక ఎంపీ క్యాంపు కార్యాలయంలో (దుబ్బాక బస్ డిపో దగ్గర) అర్హులు ఆధార్ కార్డు, రెండు ఫోటోలు, బర్త్ సర్టిఫికెట్ లేదా టెన్త్ క్లాస్ మెమోలు వెంట తెచ్చుకుని దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఎంపీ నిర్ణయం పట్ల  వారు హర్షం వ్యక్తం చేశారు.
Spread the love