గంజాయి మత్తులో యువత చిత్తు 

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలం మరియు పరిసర ప్రాంత గ్రామాలలో యువత గంజాయి మత్తులో చిత్తవుతున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సమాజంలోఎంజాయ్ కోసం యువత గంజాయి కి అలవాటు పడుతుంది గతంలో సిగరేట్ మద్యం సేవించడం ఫ్యాషన్ గా ఫీల్ అయ్యే వాళ్లు ఇప్పుడు ఆ రెండింటినీ దాటి గంజాయికి అలవాటుపడుతున్నారు. ఎక్కువగా ఇంటర్ డిగ్రీ విద్యార్థులే కాకుండా గ్రామంలో ఖాళీగా ఉండే యువకులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. మండలంలోని పరిసర ప్రాంతాల్లో గుట్టుగా గంజాయి దందా సాగుతోంది. గంజాయి కి అలవాటు అయిన యువకులకు నిత్యం సరఫరా చేసేందుకు కొందరు ముఠాగా ఏర్పడి, నిషేధిత గంజాయిని అరికట్టాల్సిన పోలీసులు, ప్రత్యేక దృష్టి సారించలేకపోవడంతో మండలంలో, పరిసర ప్రాంతాల్లో చాపకింద నీరులా సాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. గంజాయి వాడుతున్న వారిలో అత్యధికంగా మైనర్లు ఉన్నట్టు తెలుస్తుంది. తొలుత హీరోయిజంగా ప్రారంభమై, చివరకు గంజాయి లేక పిచ్చెక్కిపోయి స్థాయికి చేరుకుంటున్నారు.  ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి గంజాయి అందుబాటులో ఉండడంతో దీనిని వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. సిగరెట్లతో మొదలై గంజాయికి అలవాటుపడుతున్న యువత, మండల ఆయా గ్రామ  శివారులో నిర్మానుష్య ప్రదేశాల్లో గంజాయి తాగడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతిరోజు సాయంత్రం రాత్రివేళల్లో గంజాయి సేవించడానికి ప్రత్యేక ప్రత్యేక సమయాన్ని కేటాయించి మత్తులో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం మండల కేంద్రంలోనే కాకుండా ఆయా గ్రామాల్లో వందలాదిమంది యువకులు నిత్యం గంజాయి చేయిస్తున్నట్టు తెలుస్తోంది.
(ఓసిబి పేపర్లకు డిమాండ్)  సాధారణంగా సిగరెట్ లో నింపుకొని ఓ సి బి పేపర్ లో గంజాయి పెట్టి ఇ కాలుస్తున్నారు గంజాయిని చేతిలో వేసుకొని నడిపిన తర్వాత దానిని ఓసిబి పేపర్లో చుట్టి సిగరెట్టు తరహా కాలుస్తున్నారు. మామూలుగా కాగితం మంట అంటుకుంటే వేగంగా గాలి పోతుంది. ఈ ఓ సి బి పేపర్ ప్రత్యేకమైన కాగితం కావడంతో గంజాయి నింపి నప్పుడు సిగరెట్టు తరహా లో ఆరిపోకుండా వెలుగుతుంది.
మత్తులో మైనర్లు పాఠశాలలకు వెళ్లి చదువుకోవడం విద్యార్థులు గంజాయి నిషా కమ్మేస్తుంది గంజాయి సిగరెట్టు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. 10 లోపు విద్యార్థులు గంజాయి తో పాటు మద్యం వంటి మత్తు పదార్థాలు ఆకర్షితులై తమ ఉజ్వలమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మత్తుకు అలవాటు పడిన వారు అడ్డదారుల్లో వెళ్తున్నారు.
(చాపకింద నీరులా) మండల మరియు పరిసర ప్రాంతాల్లో చాపకింద నీరులా గంజాయి దందా విస్తరిస్తుంది. యువతను టార్గెట్ చేసుకుని పలువురు యదేచ్చగా గంజాయి విగ్రహం సాగిస్తున్నారు. యువత గంజాయి మత్తులో గొడవలకు తెగ పడుతూ రాత్రి పది దాటితే విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. కొంతమంది యువకులు గంజాయిని సేవించిన తర్వాత అమ్మకాలు కూడా జరుపుతున్నారు. 50 గ్రాముల నుండి 100 గ్రాముల ప్యాకెట్స్ గా మార్చి రూ.100 నుండి వెయ్యి రూపాయల వరకు ఒక్క ప్యాకెట్ విక్రయిస్తున్నారు. పెద్ద కొడప్గల్ పరిసర ప్రాంతాల నుండి గంజాయిని విక్రయిస్తున్నట్టు సమాచారం.
(పట్టించుకోని పోలీసులు ఎక్సైజ్ శాఖ) నిషేధిత గంజాయి విక్రయాలపై పోలీసులు దృష్టి  దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గంజాయి విక్రమ దారులు పట్టుబడిన సంఘటనలు ఎక్కడ కూడా లేవు కానీ నీ ఎక్కడినుంచి గంజాయి సరఫరా అవుతుంది. ఏ విధంగా సరఫరా అవుతుంది, అనే విషయంపై పోలీసులు దృష్టి సాధించలేరని తెలుస్తుంది. అసలు సూత్రధారులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నా, గంజాయి రవాణా జోరుగా తాగుతున్న అడ్డుకట్ట చేయడంలో విఫలం చెందుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు గంజాయి విక్రయాలను అరికట్టి యువత జీవితాలను కాపాడాల్సి ఉందని పలువురు కోరుతున్నారు.
Spread the love