గుంటూరులో యువతి దారుణ హత్య..

నవతెలంగాణ – అమరావతి: నగరంలోని షాప్‌ ఎంప్లాయీస్ కాలనీ 10వ లైన్‌లో గుర్తుతెలియని యువతి దారుణ హత్యకు గురైంది. పోలీసులు మృతురాలి ఒంటిపై పలుచోట్ల కత్తి పోట్లను గుర్తించారు. సంఘటనా స్థలంలో కత్తి లభ్యమైంది. యువతి హత్యతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పాత గుంటూరు సీఐ రమేశ్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ శరీరంపై దుర్గారావు అనే పచ్చబొట్టును గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love