నవతెలంగాణ – హైదరాబాద్
అప్పుల బాధతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెహదీపట్నం మహారాజుల కాలనీ వాసి శిరీష (32) ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది. కానీ ఈమె అప్పుల బాధ తట్టుకోలేక ఆదివారం సాయంత్రం తాను కిరాయికి ఉంటున్న ఇంట్లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.