నవతెలంగాణ – హైదరాబాద్: నారపల్లి ఫ్లై ఓవర్ పనులకు త్వరలో రీ టెండర్ పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతులు చేపడతామన్నారు. అసెంబ్లీ ప్రాంగనంలో మంత్రి కోమటిరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పాత్ర కీలకమైందని.. కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడు ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారనే కదా అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ముగ్గురు కలిసి రేవంత్‌రెడ్డిని ఓడించలేకపోయారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫారిన్ వెళితే.. చూసుకోవడానికి తానున్నానని.. భారాసకు తానొక్కడినే చాలని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి భారాస ఛాంబర్‌కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్లా అని ప్రశ్నించారు. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరినట్లేనా అని ఎదురు ప్రశ్నించారు. త్వరలో ప్రధానిని కలిసి రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతామని పేర్కొన్నారు. భారాస ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తాని వివరించారు.