విద్యుత్ షాక్ తో యువరైతు మృతి

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని చడ్మల్ తండా కి చెందిన  మాలోత్ గోపాల్ s/o ఛత్రు, 30 సంవత్సరాలు  అనే వ్యక్తి నిన్న సాయంత్రం బీర్మల్ తండకు తన బావ దగ్గరికి వెళ్లి తిరిగి నడుచుకుంటూ చద్మల్ తండాకు వస్తుండగా రాత్రి సమయంలో అనుకోకుండా రోడ్డు నుంచి లోపలికి పొలాల వైపు వెల్లగా దౌలత్ రామ్ వ్యవసాయ పొలంలో కింది పొలాలకు తీసుకువెళ్లే కరెంట్ వైరు కట్టెలకు పైకి కట్టిన కానీ, అప్పటికే పడిన వర్షానికి వైరు కిందకి పడగా ఆ వైరు ప్రమాదావశత్తు కాలుకు తగలడంతో కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. మృతుని భార్య మాలోత్ షాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు..  మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
Spread the love