చికిత్స పొందుతూ యువతి మృతి

నవతెలంగాణ – మాక్లూర్ 
మండలంలోని మానిక్ బండారు గ్రామానికి చెందిన అవంతి (21) చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నిజామాబాద్ లోని ప్రయివేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తూ ఉండేదని, ఓ రిపోర్ట్ లో తప్పుడు రిపోర్ట్ ఇవ్వడంతో 15 రోజుల క్రితం ఆస్పత్రి వారు విదుల నుంచి తొలగించారని, అప్పటి నుంచి మనస్తాపానికి గురై 17వ తేదీన సాయంత్రం ఎలుకల మందు సేవించిదన్నరు. స్థానికులు, కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించారని, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి అమర్నాథ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Spread the love