వానలో బైక్‌పై వెళుతూ సబ్బు రుద్దుకుని యువకుల స్నానం

నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్‌
ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వర్షంలో బైక్‌పై ఇద్దరు యువకులు సబ్బు రాసుకుని స్నానం చేశారు. ఇతర వాహనదారులు ఈ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై కాన్పూర్ పోలీసులు స్పందించారు. యువకుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే అస్సలు సహించబోమని హెచ్చరించారు.

Spread the love