మీ అంకితభావం మాకు స్ఫూర్తిదాయకం: యువరాజ్ సింగ్

నవతెలంగాణ -హైదరాబాద్: భగవంత్ కేసరితో మాంచి ఊపుమీదున్న నందమూరి బాలకృష్ణ ఇవాళ 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటుడిగా, ఎమ్మెల్యేగా, అన్నింటికి మంచి గొప్ప మానవతావాదిగా బాలకృష్ణకు పేరుంది. లాభాపేక్షకు తావులేని రీతిలో ఆయన బసవతారకం ఆసుపత్రి ద్వారా వేలాది క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఒకప్పుడు క్యాన్సర్ బారినపడి కోలుకున్న భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలిపారు. “నందమూరి బాలకృష్ణ సర్… మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అనేక సేవా కార్యక్రమాలతో పాటు బసవతారం క్యాన్సర్ హాస్పిటల్-రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజంపై సానుకూల ముద్ర వేసేందుకు మీరు చూపిస్తున్న అంకితభావం మా అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ ఏడాది మీరు చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ యువరాజ్ సింగ్ ట్విట్టర్ లో స్పందించారు.

Spread the love