– మీ కుటుంబం సేవలు మరువలేనివి దత్త జయంతి ప్రత్యేక హోమం పూజలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం
నవతెలంగాణ మద్నూర్
దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామానికి చెందిన వై గోవింద్ కుటుంబ సేవలు మరువలేనివని మేనూర్ గ్రామ ప్రజలు ఆ కుటుంబం గురించి ప్రత్యేకంగా కొనియాడారు. మంగళవారం నాడు మేనూర్ గ్రామ శివారు పరిధిలో దత్త ఆలయం వద్ద జయంతి వేడుకలు ఆ కుటుంబం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద ప్రత్యేక హోమం పూజలు గ్రామ 108 దంపతుల ద్వారా ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టిన ఆ కుటుంబానికి గ్రామస్తులంతా అభినందించారు. దత్త భగవాన్ ఆలయం నిర్మించి ప్రతి సంవత్సరం దత్త జయంతి వేడుకలు భారీ ఎత్తున నిర్వహించడం మీ కుటుంబ సేవలు మరువలేనివని గ్రామస్తులంతా ప్రత్యేకంగా కొనియాడడం ప్రతి గ్రామంలో దత్త జయంతి వేడుకలు గ్రామస్తులు ఆధ్వర్యంలో అందరి సహకారంతో నిర్వహిస్తారు. ఇక్కడ మాత్రం వై గోవింద్ కుటుంబం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఖర్చులు చేసి గ్రామానికి ఆదర్శంగా పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆ కుటుంబానికి దత్త భగవానుడు ఎల్లవేళలా ఆశీర్వాదిస్తాడని పేర్కొన్నారు.