– జాతీయ గుర్తింపు పొందిన పార్టీలకు శాశ్వతం
– మిగతా పార్టీలకు ప్రిసింబల్స్
నవతెలంగాణ- మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు వారి రిజిస్టర్డ్ గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. ఒక్క సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఏవైనా నాలుగు రాష్ట్రాల ఓట్లలో నాలుగు శాతం సంపాదించగలిగితే దాన్ని జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఒక్క పార్టీ రాష్ట్రం లేదా ఒక్క ప్రాంతంలో నాలుగు శాతం ఓట్లు సాధిస్తే దాన్ని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తారు. ఆతరువాత వీరికి ఎన్నికల సంఘము గుర్తులు కేటాయిస్తుంది. అయితే సిద్దాంత రీత్యా వ్యక్తుల వల్ల కానీ, పార్టీ చిలిపోయినప్పుడు ఆపార్టీ గుర్తును ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం ఏర్పడితే ఎన్నికల సంఘం సమస్యను పరిష్కరిస్తోంది.
జాతీయ పార్టీలు…
దేశంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఏడు ఉన్నాయి. వీటికి ఎన్నికల సంఘము కేటాయించిన గుర్తులను మారే పార్టీలను కానీ, స్వతంత్ర అభ్యర్థులను కానీ కేటాయించదు. దేశంలో ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అప్ ఇండియా (మార్కిస్టు), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, అంఆద్మీ పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపుగా సాధించాయి.
రిజిస్టర్డ్, ఆన్ రికగనైజ్డ్ పార్టీలు..
జాతీయ పార్టీలతోపాటు రిజిస్టర్డ్, ఆన్ రీకగ్నైజ్డ్ పార్టీల తరుపున కూడా అభ్యర్థులు పోటీలో ఉంటారు. అపార్టీలను కొందరు వ్యక్తులు సంవస్థల పేరిట ఎన్నికల సంఘం వద్ద నమోదు చేస్తారు. ఎన్నికల్లో పోటీ చేసిన చేయకపోయినా అవి అలాగే కొనసాగుతుంటాయి. ఒకవేళ పోటీ చేస్తే ఆపార్టీ అభ్యర్థులకు ఎన్నికల సమయాన ఎన్నికల సంఘము ప్రి సింబల్స్ గా ఉంచే వాటి జాబితా నుంచి గుర్తు కేటాయిస్తోంది. అయితే వారికి ఇండిపెండెంట్ అభ్యర్థుల కన్నా ముందు గుర్తులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు.ప్రస్తుతం మన దేశంలో సుమారుగా 1983 రిజిస్టర్డ్ ఆన్ రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి. ఇవి తెలంగాణలో 73 వరకు ఉన్నాయి. అదే విధంగా 164 ప్రి సింబల్స్ అందుబాటులో ఉంటాయి.