– మోడీపై ఖర్గే విమర్శలు
న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని ఎప్పుడూ పాత ప్రసంగాలే చేస్తున్నారని.. మళ్లీ మళ్లీ వాటినే పునరావృతం చేసినా దేశ ఆర్థిక వ్యవస్థలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చలేరన్నారు. మేకిన్ ఇండియా విఫలమైందన్న ఖర్గే.. ప్రజలపై గృహ రుణాల భారం, ధరల పెరుగుదల, తయారీ రంగంలోని సమస్యలను లేవనెత్తారు. 2013-14 నుంచి నేటి వరకు గృహ సంబంధిత ఖర్చులు 241 శాతం పెరిగాయి. జీడీపీలో గృహ రుణం ఎన్నడూ లేని విధంగా పెరిగింది. కొవిడ్ సమయం నుంచి ప్రజలకు ఆదాయం కంటే ఖర్చు రెట్టింపైంది” అని ఖర్గే ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
”గతేడాదితో పోలిస్తే.. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరిగాయి. మేకిన్ ఇండియా ఘోరంగా విఫలమైంది” అంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు.