ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య 

నవతెలంగాణ-నిజాంసాగర్
మండలంలోని మల్లూరు గ్రామంలో అడ్డగళ్ల సాయిలు (20) అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడని ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. సాయిలు ఇంటర్ వరకు చదువుకొని కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి ఓ కంపెనీలో నెల రోజుల పాటు పని చేసుకొని తిరిగి మళ్ళీ గ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయ్యలో అర్థం కాక జీవితంపై విరక్తి పొంది గురువారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత గ్రామ పొలిమేర స్మశాన వాటికలోకి వెళ్లి చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆయన తెలిపారు. తండ్రి సంజీవులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Spread the love