నవతెలంగాణ- తుర్కపల్లి: ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం తుర్కపల్లి మండలంలో చోటుచేసుకుంది.వివరాలకు వెళితే తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మపురం గ్రామానికి చెందిన ఓర్సు ఎల్లం (27) ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉదయం రోజు మాదిరిగానే ఇంట్లో నుంచి వెళ్లాడు. బద్దతుండ గ్రామ శివారులో మామిడి తోటలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని భువనగిరి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. మృతి గల కారణాలు తెలియాల్సి ఉన్నాయని ఎస్ఐ రాఘవేంద్ర గౌడ్ తెలిపారు.