యూత్ కాంగ్రెస్ విస్తృత సాయి సమావేశం

నవతెలంగాణ- ఆర్మూర్ 

యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం బుధవారం పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోర్త రాజేంధర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాజేంధర్ మాట్లాడుతూ 25 వేలతో కూడిన  మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేసి ఉద్యోగ కల్పన చేయాలని నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ భారస ప్రభుత్వం యువతను మోసం చేసిందని  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల ఉద్యోగుల భర్తీ చేపడుతుందని, ఆర్మూర్ యూత్ కి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఏ కేసులకు భయపడకూడదని టికెట్ ఎవరికి వచ్చిన కలిసికట్టుగా పని చేద్దామని యూత్ కి దిశ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ ఉపాధ్యక్షులు ప్రశాంత్ అన్ని మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love