ఆరు గ్యారంటీపై యూత్ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామంలోని బూత్ నెంబర్ 246లో యూత్ కాంగ్రెస్ నాయకులు గురువారం మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఫొటోతో కూడిన టిషర్ట్స్ ధరించి ఆరు గ్యారెంటీ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గడపగడపకు గ్యారెంటీ కార్డులు పంచుతూ ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించారు. కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటువేసి మంథని ఎమ్మెల్యేగా శ్రీదర్ బాబును గెలిపించాలని ఓటర్లను అన్యర్దిoచారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వంద రోజుల్లో గ్యారెంటీ కార్డులో చెప్పిన ప్రకారంగా హామీలు అన్ని అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ జంజర్ల ప్రశాంత్, రావుల  రవీందర్ ఇందారపు విష్ణువర్ధన్, బూడిద ప్రకాష్, రాకేష్, తోకల కౌశిక్, నికిల్, కుమార్ పాల్గొన్నారు.
Spread the love