కిశోర బాలికల ఆరోగ్య సంరక్షణ, అవగాహన సదస్సు

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం టాటా సామాజిక సేవా ప్రాజెక్ట్స్ లో భాగంగా కేర్ ఇండియా స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కిశోర బాలికల ఆరోగ్య సంరక్షణ, అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో కేర్ ఇండియా ఆరోగ్య కార్యకర్తలు విద్యార్థులకు నాలుగు ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను వివరించారు. పోషకాహారం, నులి పురుగుల నివారణ, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తి గత ఆరోగ్యం కోసం  తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది.మన ఆరోగ్యం మనం తీసుకునే జాగ్రత్తల పైనే ఆధారపడివుంటుందని ప్రధానోపాధ్యాయులు  కుంజా రాజేశ్వర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో కేర్ ఇండియా ప్రతినిధులు సాయిప్రియ, రూప్ సింగ్ పాఠశాల ఉపాధ్యాయులు చల్లగురుగుల మల్లయ్య, మొలుగూరి రమేష్, దామరాజు సమ్మయ్య, ముడుంబై వెంకట రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Spread the love