– రెంజల్ ఎస్సై ఉదయ్ కుమార్
నవతెలంగాణ-రెంజల్ : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మండలంలోని యువత సమన్వయం పాటించాలని రెంజల్ ఎస్సై ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు. రెంజల్ మండలంలో 110 గణేష్ మండపాలను చిన్నారుల నుంచి గ్రామ కమిటీ సభ్యుల వరకు ఏర్పాటు చేశారని, వారందరూ గణేష్ మండపాల వద్ద ప్రత్యేక నిగని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. గణేష్ మండపాలకు విద్యుత్ శాఖ అధికారుల అనుమతులను తీసుకొని కరెంటును వాడుకోవాలి తప్ప డైరెక్టుగా కనెక్షన్ తీసుకున్నట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాహనదారులు సైతం గణేష్ మండపాల వద్ద వాహనాలను నెమ్మదిగా నడిపించాలని, చిన్నారులు ఆనంద ఉత్సవంలో ఆడుకుంటూ ఉంటారని వాహనదారులకు ఆయన సూచనలు ఇచ్చారు. నిమజ్జన సమయంలో ప్రతి ఒక్కరు సమన్వయం పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో శోభయాత్రలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. నిమజ్జన సమయంలో డీజీలు వాడకూడదని, యువత మద్యం సేవించకుండా ప్రశాంతంగా నిమజ్జోత్సవంలో పాల్గొనాలనీ ఆయన సూచించారు.