యువత అధిక సంఖ్యలో క్రీడల్లో రాణించాలి

– క్రీడాకారులకు బహుమతుల ప్రదానొత్సవంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందర్య రాజన్‌
నవతెలంగాణ – ధూల్‌ పేట్‌
యువత అధిక సంఖ్యలో క్రీడల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందర్య రాజన్‌ అన్నారు. సాలార్జంగ్‌ మ్యూజియంలో కేలో భారత్‌ జీతో భారత్‌ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానొత్సవ కార్యక్రమానికి అమే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత అన్ని రంగాలతో పాటు క్రీడల్లో కూడా ఎక్కువగా రాణించాలని అన్నారు. క్రీడాకారులకు పీఎం రెసిడెన్సీలో ప్రోత్సాహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందించారని అన్నారు. మంచి న్యూట్రిషన్‌ మిల్లెట్స్‌తో కూడిన ఆహారం కూడా తీసుకోవాల్సిన అవసరం క్రీడాకా రులకు ఉందన్నారు. యువత క్రీడలతోపాటు యోగాతో పోటీ పడితే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లా డుతూ భారతదేశ జనాభా చైనాను దాటిపోయిందని ఇతర దేశాలు జనాభా ఉత్పత్తి కోసం ఎన్నో పథకాలు పెట్టినా భారతదేశం మాత్రం ఘనత సాధించింది అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రీడాకా రులను ప్రోత్సహిస్తూ దేశవ్యాప్తంగా ఖేలో భారత్‌ జీతో భారత్‌ను హైదరాబాద్‌ పార్లమెంటుగా డాక్టర్‌ లక్ష్మణ్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. క్రీడాస్థలాలను ఏర్పాటు చేయాలని క్రీడ స్థలాలు కబ్జాకు గురికాకుండా యువత కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. యువత మత్తు మద్యపానీయాలకు గురికాకుండా కీడలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించే వారికి ఎంతో భవిష్యత్తు ఉందని వారికి ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి అన్నారు. క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 5 లక్షల రూపాయలను ప్రోత్సహిస్తుందని రెండువేల కోట్ల రూపాయలను క్రీడల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించి క్రీడారంగాలలోనూ విశ్వవిద్యాల యాలను చేపట్టనుంది అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారిని నైనా జైస్వాల్‌. బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ హైదరాబాద్‌ కన్వీనర్‌ శంకర్‌ యాదవ్‌, రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి మీర్‌ ఫిరాసత్‌ అలీ బాక్రి, అర్జున అవార్డు గ్రహీత అరుణ్‌ కుమార్‌, కబడ్డీ కోచ్‌ జగదీష్‌ యాదవ్‌, షహజాది బేగం, పాండు యాదవ్‌, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love