స్వయం ఉపాధితో యువత రాణించాలి

– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-సంతోష్‌నగర్‌
ఉద్యోగుల కోసం నిరీక్షించకుండ స్వయం ఉపాధి రంగాలను ఎంచుకుని రాణించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్‌ మండలం నాదర్గుల్‌ గ్రామం రోడ్డు బడంగ్‌ పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన దావత్‌ గ్రాండ్‌ రెస్టారెంట్‌ బంక్వెట్స్‌ బాన్బెనిఫిట్‌ హాల్‌ను పలువురు నేతలు హాజరై ప్రారంభించారు. డైరెక్టర్‌ ముఖ్య అతిథిగా మంత్రి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జీ అందెల శ్రీరాములు, రమేష్‌ గౌడ్‌, వినేష్‌ గౌడ్‌ నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు, అనంతరం నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన అన్ని రకాల వంటకాలను ప్రత్యేకతతో తయారు చేసి విక్రయించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగు ణంగా నూతన కొత్త వంటకాలను అందించి ప్రజల మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. పరిశుభ్రతమైన నాణ్యత గల జాగ్రత్త పాటిం చాలన్నారు. అభివృద్ధి చెందలంటే మారుతున్న కాలానుగుణంగా కష్టపడి పురోగతి చెంది వినియోగదారులకు మంచి సేవలు అందించినప్పుడే విని యగదారులు మీ సేవ సౌకర్యాలు అందుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సభ్యులు యువకులు పెద్దలు, పాల్గొన్నారు.

Spread the love