ఉపాధి కోసం యువత పోరాడాలి

– జులై 8 నుంచి హైదరాబాద్‌లో జాతీయస్థాయి వర్క్‌షాప్‌
– ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధి అవకాశాల కోసం యువత పోరాడాలని ఏఐవైఎఫ్‌ నేతలు పిలుపునిచ్చా రు. వచ్చేనెల 8 నుంచి పదో తేదీ వరకు హైదరాబాద్‌లో ఇదే అంశంపై జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని హిమా యత్‌నగర్‌లో అందుకు సంబంధించిన పోస్ట ర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వల్లీ ఉల్లాఖాద్రీ, కార్యదర్శి కె ధర్మేంద్ర మాట్లాడుతూ మత ఛాందస విధానాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మత పోకడలతో యువత పెడదారి పడుతు న్నారని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విధానా లను దేశమంతా వ్యాపింపచేసేందుకు బీజేపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారని అన్నా రు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించ డంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. నిరుద్యోగుల ను మోసం చేస్తున్న టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.అన్ని పరీక్షలనూ పారదర్శకంగా నిర్వ హించాలని కోరారు. జాతీయ స్థాయి వర్క్‌ షాప్‌కు అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, మేధా వులు, పలువురు ఎంపీలు హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌ శ్రీకాంత్‌, మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి టి సత్యప్రసాద్‌, రాష్ట్ర సమితి సభ్యులు శ్రీమాన్‌, నర్సింహ్మా తదితరులు పాల్గొన్నారు.
క్షతగాత్రులను ఆదుకోవాలి
ఒడిశాలో రైలు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సమితి సానుభూతిని ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను కేంద్రం ఆదుకోవాలని, తక్షణమే ఆర్థిక సహాయాన్ని వేగంగా అందించాలని కోరింది.

Spread the love