యువత ఆర్థికంగా ఎదగాలి: ఎర్రబెల్లి

– తొర్రూరు మెగా జాబ్ మేళాకు భారీ స్పంద‌న‌
– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
– నవతెలంగాణ -తొర్రూర్ రూరల్
యువత ఆర్థికంగా ఎదగాలి. వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడాలి. వారు, వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో బతకాలి. కన్నతల్లి దండ్రులకు మంచి పేరు తేవాలి. అన్నదే నా సంకల్పం అందుకే నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ శిక్షణ ఇవ్వడమే కాకుండా ఈ జాబ్ వారికి ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పిస్తున్నాను అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో రామా ఉపేందర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా ను మంత్రి సోమవారం ప్రారంభించారు. డి.ఆర్.డి.ఎ, మహబూబాబాద్ జిల్లా మ‌రియు ఎర్ర‌బెల్లి ట్ర‌స్టుల సంయుక్త ఆధ్వ‌ర్యంలో తొర్రూరులోని నిర్వ‌హించిన మెగా జాబ్ మేళా విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ జాబ్ మేళాలో మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు స‌హా మొత్తం 82 వివిధ కంపెనీలు పాల్గొన‌గా, దాదాపు 14వేల ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించడానికి అవ‌కాశాలు ఉండ‌గా, ఆయా ఉద్యోగాల కోసం వేలాదిగా ఉద్యోగార్థులు త‌ర‌లివ‌చ్చారు. నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి మండలాల ఉద్యోగార్థులకు మెగా జాబ్ మేళా నిర్వహించినప్పటి కి, ఆయా మండ‌లాల నుంచేగాక‌, జిల్లాలోని ప‌లు ప్రాంతాల నుంచి వేలాదిగా యువ‌తీ యువ‌కులు త‌ర‌లి వ‌చ్చి, ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఆయా కంపెనీల ప్ర‌తినిధులు ఓపిక‌గా ఇంట‌ర్వ్యూలు చేశారు. వారి అర్హ‌త‌లు, ఇంట‌ర్వ్యూల‌ను ఎదుర్కొన్న తీరుతెన్నులు, అవ‌కాశాల‌ను బ‌ట్టి అనేక మందికి ఈ మేళా ద్వారా ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు. అనంతరం మంత్రి జాబ్ మేళా సందర్భంగా ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇంటర్వ్యూలు చేస్తున్న కౌంటర్ల వద్దకు వెళ్లి ఇంటర్వ్యూలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులతో మంత్రి కొద్దిసేపు మాట్లాడారు.  అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ లు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చింది. కొత్తగా మరో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే రావు ప్రైవేటు రంగంలోనూ అద్భుత అవకాశాలు మెరుగుపడ్డాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగులతోపాటు ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా మంచి జీతాలు ఆర్ధిస్తున్నారు. అలాంటి అవకాశాలను స్థానికంగా యువతకు అందించాలన్న లక్ష్యంతో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. కంపెనీలలో సెలెక్ట్ అయిన వారు సుమారు 12 వేల నుండి 40 వేల వరకు జీతభత్యాలు ఉంటాయి. ఉద్యోగాలలో చేరిన తరువాత పనితీరు అనుభవముతో భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మొత్తంలో జీత భత్యాలు సంపాదించుకోవచ్చు. మంచి అవకాశలు పొందవచ్చును.ఈ జాబ్ మేళా నిర్వహించుటకు ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ , జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జనగామ‌ మ‌రియు ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో నిర్వహించడం ఎంతో అభినందనీయం అని అన్నారు. పెద్దవంగర రాయపర్తి మండలాల నిరుద్యోగులకు ఈ మేళ ఎంతో ఉపయోగం అన్నారు. ఈ జాబ్ మేళాకు పాలకుర్తి నియోజకవర్గమే కాకుండా మహబూబాబాద్ డోర్నకల్ వంటి పక్క నియోజకవర్గాల నిరుద్యోగులు కూడా హాజరయ్యారని మంత్రి తెలిపారు. చిన్న ఉద్యోగాలని, చిన్నచూపు తగదు
చిన్న ఉద్యోగాలని చిన్న చూపు చూడకండి ఎంత దూరం ప్రయాణమైన ఒక అడుగుతోనే మొదలవుతుంది అలాగే చిన్న చిన్న స్థాయి ఉద్యోగాలతోనే ఉన్నత ఉద్యోగాల అవకాశాలు లభిస్తాయి చిన్న జీతాలు తీసుకున్నా అనేకమంది గొప్ప గొప్ప జీతాలు తీసుకుని అత్యున్నత స్థానాలకు ఎదిగిన వారు ఉన్నారు. ఇప్పుడు చిన్న ఉద్యోగాల్లో చేరితే, భవిష్యత్తులో మంచి జీతభత్యాలు లభిస్తాయని గతంలో లాగే పాలకుర్తి నియోజకవర్గంలో మళ్లీ ఉచిత ఉద్యోగ ఉపాధి శిక్షణ మెటీరియల్ పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.  ఈ జాబ్ మేళాలో పాల్గొన్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ ఇది అరుదైన అద్భుత అవకాశం నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగ అవకాశాలు పొందాలి తద్వారా వారి జీవితాలను వారు బాగు చేసుకోవాలి ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే అన్ని విధాలుగా ఆ కుటుంబాలు బాగుపడతాయి అందుకు మీరు కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ డేవిడ్, అర్ డి ఓ, డిఆర్ డిఓ, ఇత‌ర అధికారులు, ఆయా కంపెనీల ప్ర‌తినిధులు, పార్టీ, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఎర్రబెల్లి ట్రస్టు బాధ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.
Spread the love