యువత అధిక సంఖ్యలో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలి

– పైడాకుల అశోక్ ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ కార్యక్రమంలో యువత అత్యధికంగా పాల్గొని బహుమతులను గెలుచుకోవాలని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని చల్వాయి గ్రామంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ముందుగా రాజీవ్ గాంధీ యూత్ కిస్ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణను చేసి అశోక్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ గారి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమాన్ని సద్వినియోగ పర్చుకొని బహుమతులు గెలుచుకోవాలని జిల్లా యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ యందు పేరు నమోదు చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ నుండి 7661899899 అను నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వగా టెక్స్ట్ మెసేజ్ రూపంలో రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది అట్టి లింకుని క్లిక్ చేసి మీ యొక్క వివరాలను నమోదు చేసి రిఫరల్ ఐడి దగ్గర మన ములుగు నియోజకవర్గ కోడ్ 1129 ఎంటర్ చేయండి. దాని తరువాత మనకు హాల్ టికెట్ నంబర్ వచ్చును. అట్టి నెంబరును భద్రపరుచుకొని ఆన్లైన్ నందు పరీక్ష రాయవలసి ఉంటుంది. ఇట్టి పేరు నమోదుకు చివరి తేదీ: 17.06.2023 అలాగే ఆన్లైన్ పరీక్ష తేదీ: 18.06.2023 రోజు 60 నిమిషాల సమయంలో 60 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి నియజకవర్గం నుండి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మొదటి నలభై మందికి 40 బహుమతులు అందజేయును. అలాగే ప్రతి నియోజకవర్గం నుండి 18 సంవత్సరాలు నిండిన యువతికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీ అందజేయబడును. మొదటి 3 బహుమతులు ప్రథమ బహుమతిగా ల్యాప్ టాప్, ద్వితీయ బహుమతిగా స్మార్ట్ ఫోన్, తృతీయ బహుమతిగా ట్యాబ్ అందజేయబడును. కావున తక్షణమే 16 నుండి 35 సంవత్సరాల లోపు యువత రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ యందు పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ములుగు మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, వెంకటాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్, మండల మహిళ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, ఎస్.సి.సెల్ మండల అధ్యక్షులు పడిదల సాంబయ్య, ఎంపీటీసీలు చాపల ఉమాదేవి- నరేందర్ రెడ్డి, గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్, గోపిదాసు ఏడుకొండలు, జెట్టి సోమయ్య, పాలడుగు వెంకటకృష్ణ, కొంపెళ్లి శ్రీనివాస్ రెడ్డి, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, సూదిరెడ్డి జయమ్మ, వేల్పుగొండ ప్రకాశ్, కోరం రామ్మోహన్, గుండె శరత్, మల్లారెడ్డి, బద్దం జనార్దన్ రెడ్డి, కంటెం సూర్యనారాయణ, అలుగుబెల్లి వెంకటస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love