విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఎస్సై లెనిన్ సూచించారు. నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా బుధవారం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థుల చేత అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేసి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ లెనిన్ మాట్లాడుతూ.. విద్యార్థులు యువత ప్రతిరోజు ఎక్కడ తిరుగుతున్నారు ఎలాంటి వారిపట్ల స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు ఏవైనా చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారా అనే విషయాలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలై ఏవైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా అని విషయాలపై తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.