గంజాయి నిర్మూలనకు యువత నడుం బిగించాలి: ఎస్పీ

Youth should tighten their waists for eradication of ganja: SP– యువత క్రీడల్లో  గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలి
– జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దోస్తీ మీట్ – 2024 కబడ్డీ, వాలీబాల్ పోటీలు
నవతెలంగాణ – సిరిసిల్ల
యువత చెడు వ్యసనాలకు దూరమై ఉన్నత లక్ష్యాల వైపు సాగాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన దోస్తీ మీట్ – 2024  మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీల్లో గెలుపోదిన జట్లతో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన పోటీలకు ముఖ్య అతిదిగా హాజరై ఆయన బహమతులు అందజేశారు. మండల స్థాయిలో గెలుపొందిన 17 కబడ్డీ జట్లు,12 వాలిబల్ జట్లు జిల్లా స్థాయిలో పాల్గొనడం జరిగింది. కబడ్డీ ఫైనల్ మ్యాచ్ లో వేములవాడ రూరల్, వీర్నపల్లి జట్లు పాల్గొనగా మొదటి స్థానం వేములవాడ రూరల్ టీమ్, రెండవ స్థానం వీర్నపల్లి టీమ్ కు దక్కింది. వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ లో వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట్ జట్లు పాల్గొనగా మొదటి స్థానం రుద్రంగి, రెండవ స్థానం ఎల్లారెడ్డిపేట్ B టీం కు దక్కింది. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ… దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉంటుందని, చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, అదే ఉద్దేశ్యంతో కమ్యూనిటీ  పోలీసింగ్ లో భాగంగా జిల్లాలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు, మాధకద్రవ్యాల వలన కలుగు అనార్దలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి మండల స్థాయిలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ మీట్ – 2024 లో భాగంగా కబడ్డీ వాలీబాల్  పోటీలు నిర్వహించామన్నారు.
మండల స్థాయిలో గెలుపోయిందిన జట్లకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. యువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని, క్రీడల్లో ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, అదే స్ఫూర్తి ని నిజ జీవితంలో అలవర్చుకుంటు ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా,ఆరోగ్యం గా దృడంగా ఉండడంతో పాటు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని అన్నారు.నిజ జీవితంలో సమిష్టి కృషి తోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని అన్నారు. క్రీడ ఓటమి చెందిన వారు తమ లోపాలను సవరించుకొని  ముందుకు వెళ్లడం అలవర్చుకోవాలని అన్నారు.  ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ,మోగిలి,శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ ఆర్.ఐ లు మాధుకర్, యాదగిరి, రమేష్ , ఎస్.ఐలు సిబ్బంది ,వ్యాయామ ఉపాద్యాయులు,
క్రీడాకారులు ఉన్నారు.

Spread the love