యూనివర్సిటీలో యువజన క్రీడోత్సవాలు


నవతెలంగాణ డిచ్ పల్లి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో స్వామీవివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతులను పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీలో యువజన క్రీడోత్సవాలను యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటలు యువకులకు మానసికంగానూ, శారీరకంగానూ ఉపయోగ పడతాయని, ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన యువత దేశానికి అవసరమని స్వామి వివేకానంద చెప్పిన సూక్తిని ఆదర్శంగా తీసుకొని యువకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగరాజ్, నాయకులు సాయి కుమార్, అమృత్ చారి, ప్రమోద్, సింహాద్రి, నరసింహ తదితరులు పాల్గొన్నారు

Spread the love