సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ అవినాశ్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. మే 31న అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి శనివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు.

Spread the love